: పెద్దనోట్ల రద్దుపై ప్రధానికి లేఖ రాసిన జగన్
పెద్దనోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఒక లేఖ రాశారు. నోట్ల రద్దు తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతులకు ఎక్కడా డబ్బు దొరకడం లేదని తన ఆవేదనను ఆ లేఖలో వ్యక్తం చేశారు. రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, ఎరువులు, విత్తనాలు అమ్మేవారు పాతనోట్లను తీసుకోవడం లేదని, నోట్ల రద్దుతో పండిన పంటలను సైతం రైతులు అమ్ముకోలేకపోతున్నారని, సగం ధరకే పంటలను మధ్యవర్తులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు వెనుక ఉన్న ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ, వాటిని సరిగా అమలు చేయకపోతే విఫలమవుతాయని, ఒకేఒక్క నిర్ణయంతో రాత్రికే రాత్రే మార్పు రాదంటూ ప్రధానికి రాసిన లేఖలో జగన్ అభిప్రాయపడ్డారు.