: జమ్మూకశ్మీర్ లో 40 లక్షల రూపాయల వంద నోట్లు దోచేశారు!


జమ్మూకశ్మీర్ లో భారీ దోపిడీ చోటు చేసుకుంది. పెద్ద నోట్ల రద్దుతో జమ్మూకశ్మీర్ లో అల్లర్లు తగ్గాయని, రాళ్లు రువ్వేందుకు డబ్బులిచ్చేవారు లేక ఆందోళనకారులు రోడ్డెక్కడం లేదని, దీంతో జనజీవనం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటోందంటూ ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రధానికి ధన్యవాదాలు చెబుతూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అగ్రల్ సర్థా గ్రామంలో బ్యాంకుపై దాడి చేసిన దుండగులు 40 లక్షల రూపాయల విలువైన 100 రూపాయల నోట్లను ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. మరో ఘటనలో గుజరాత్ లోని అహ్మద్ నగర్‌, జామ్‌ నగర్‌ లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు పలువురు అనుమానితులపై దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ, బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి. సుమారు 34.4 లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News