: నిక్కీ హేలీకి మంచి పదవి ఇవ్వనున్న ట్రంప్
ఇండో అమెరికన్ నిక్కీ హేలీకి అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంచి అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ నేత అయిన నిక్కీ హేలీ కీలక పాత్ర పోషించారు. దీంతో ఆమె పట్ల సానుకూలంగా వున్న ట్రంప్, ఆమెకు టాప్ పోస్ట్ ను ఆఫర్ చేసిన్టటు తెలుస్తోంది. అమెరికా తరపున ఐక్యరాజ్యసమితి రాయబారిగా ఆమెను ట్రంప్ నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ కరోలినా రాష్ట్ర గవర్నర్ గా ఉన్న నిక్కీ హేలీ భారతీయ సంతతి వ్యక్తి అన్న సంగతి తెలిసిందే.