: రిలయన్స్ జియో 'డేటా వాడకం' బిల్లుపై స్పందించిన సంస్థ ప్రతినిధులు


రిలయన్స్ జియో సిమ్ ను వాడుతున్న ఒక వినియోగదారుడు డేటాను వాడినందుకు బిల్లు పంపించారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. ఈ విషయమై సంస్థ ప్రతినిధులు స్పందించారు. రిలయన్స్ జియో సంస్థ బిల్లు పంపిన వార్త అవాస్తవమని స్పష్టం చేశారు. కాగా, కోల్ కతాలో ఉంటున్న అయునుద్దిన్ మొండల్ కు జియో సంస్థ పంపినట్లుగా ఉన్న ఒక బిల్లును సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ గా మారడంతో.. ఈ విషయమై సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఆ బిల్లులో 550 జీబీ డేటా వాడుకున్నందుకు 27 వేల రూపాయలకు పైగా సదరు వినియోగదారుడికి వచ్చినట్లుగా ఆ బిల్లులో ఉంది. వినియోగదారుడి ఫోన్ నంబర్ కూడా ఈ బిల్లులో ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News