: అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన షియోమీ రెడ్‌మీ స్మార్ట్ ఫోన్లు


చైనా మొబైల్ సంస్థ షియోమీ మొబైల్ విక్ర‌యాల్లో దూసుకుపోతోంది. భార‌త్‌లో చైనా వ‌స్తువుల‌కి వ్య‌తిరేకంగా సోష‌ల్‌మీడియా వేదిక‌గా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగినా ఆ ప్ర‌భావం క‌న‌ప‌డ‌డం లేదు. గత ఆగస్టులో ఆ సంస్థ‌కు చెందిన‌ రెడ్‌మీ 3ఎస్‌, రెడ్‌మీ 3ఎస్‌ ప్రైమ్‌ మోడల్స్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నాలుగు నెల‌ల స‌మ‌యంలోనే మిలియన్‌ మొబైల్స్‌ ను అమ్మినట్లు ఈ కామర్స్ సంస్థ‌ ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ రికార్డును సాధించినందుకు ఎంఐ ఇండియాకు అభినందనలు తెలిపింది. షియోమీ స్మార్ట్‌ఫోను త‌క్కువ ధ‌ర‌తో అన్ని స‌దుపాయాల‌తో ఉండ‌డంతో వినియోగ‌దారులు వాటికి బాగా ఆక‌ర్షితుల‌వుతున్నారు. రెడ్‌మీ 3ఎస్‌ రూ.6,999కి అందుబాటులో ఉండ‌గా, మ‌రిన్ని ఫీచ‌ర్ల‌తో మార్కెట్లోకి వ‌చ్చిన‌ రెడ్‌మీ 3 ఎస్‌ ప్రైమ్‌ రూ.8,999కు ల‌భిస్తోంది.

  • Loading...

More Telugu News