: క్రికెట్ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడ్డ హైదరాబాదు రంజీ ఆటగాడు
రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ తీవ్రంగా గాయపడ్డాడు. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో చత్తీస్ గఢ్ తో జరుగుతున్న మ్యాచ్ లో షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న తన్మయ్ అగర్వాల్ తలకు మనోజ్ సింగ్ కొట్టిన బంతి బలంగా తగిలింది. దీంతో విలవిల్లాడుతూ తన్మయ్ కిందపడిపోయాడు. దీంతో అతడిని సహచరులు, ఫీల్డ్ అంపైర్లు, గ్రౌండ్ వైద్యులు హుటాహుటీన అహ్మదాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. దీంతో మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోయింది. వైద్యులు తన్మయ్ కు చికిత్స అందిస్తున్నారు.