: జన్ ధన్ ఖాతాల ద్వారా డిపాజిట్ అయిన డబ్బు 21 వేల కోట్లు?


జన్ ధన్ ఖాతాల్లోకి భారీ ఎత్తున డబ్బులు డిపాజిట్ అయినట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ప్రకటించడంతో నవంబర్ 8 నుంచి నేటి వరకు దేశ వ్యాప్తంగా ఉన్న జన్ ధన్ ఖాతాల ద్వారా సుమారు 21 వేల కోట్ల రూపాయలు డిపాజిట్ అయినట్టు గుర్తించారు. దీంతో అకౌంట్ హోల్డర్ల లావాదేవీలు, డిపాజిట్లపై పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం ఆరాతీస్తోంది. ఈ డిపాజిట్లలో ఎక్కువ పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో జన్ ధన్ ఖాతాల ద్వారా జరిపిన లావాదేవీలపై ఖాతాదారులకు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం వుంది.

  • Loading...

More Telugu News