: ఉల్లిపాయలు వంటకే కాదు.. ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు!


ఉల్లిపాయలు వేసి చేసే వంకాయ, ఆలుగడ్డ, టమాట... కూరలతో పాటు నాన్ వెజ్ వంటకాలు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరోగ్య రీత్యా కూడా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది. ఉల్లిపాయల ఉపయోగం వంటగదికే కాకుండా, దీని ఇతర ఉపయోగాల విషయానికి వస్తే.. * తుప్పు పట్టిన చాక్ లపై ఉల్లిపాయతో రుద్దితే మెరవడం ఖాయం * కొత్తగా పెయింట్ వేసిన గదిలో ఆ వాసన పోవడానికి ఉల్లి రూమ్ ఫ్రెషనర్ లా పనిచేస్తుంది. నీళ్లు ఉన్న ఒక పాత్రలో తాజా ఉల్లిపాయ ముక్కలను ఉంచి ఆ పాత్రను ఒక రోజు రాత్రంతా ఆ గదిలో ఉంచితే చాలు. * ముఖంపై మొటిమలు పోవాలంటే.. నలక్కొట్టిన ఉల్లిపాయ ముక్కలను కొంచెం నీటిలో కలిపి, దానిని మొటిమలపై రాసుకుంటే సరిపోతుంది. * తేనెటీగ కుట్టినచోట ఉల్లిపాయతో రుద్దితే బాధ తీవ్రత నుంచి ఉపశమనం లభిస్తుంది. * ఐరన్ చేస్తున్నప్పుడో లేక స్టౌ పై నుంచి గిన్నెలు దించుతున్నప్పుడో కొద్దిగా కాలినప్పుడు కూడా ఆయా చోట్ల ఉల్లిపాయను రుద్దితే ఉపశమనం లభించడమే కాక ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండటం వంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News