: ఏయ్ ఉమా! నీకు సిగ్గు, లజ్జ ఉంటే... ఇడుపులపాయకు వెళ్దాం రా!: పార్థసారథి


తమ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ నేత పార్థసారథి మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్టు పాచినోటితో మాట్లాడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును వైసీపీ ఎన్నడూ అడ్డుకోదని... టీడీపీ నేతలకు మామూళ్లు ఇచ్చుకోలేకే ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. దివీస్ ఫార్మా ఇచ్చే ముడుపులకు ఆశపడే పేదవారి భూములను లాక్కుని, వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. "ఉమా, నీకు సిగ్గు, లజ్జ ఉంటే ఇడుపులపాయకు వెళ్దాం. అక్కడ అంగుళం అంగుళం వెతుక్కో. అక్కడేమీ దొరక్కపోతే మీ నాయకుడు చంద్రబాబుతో క్షమాపణ చెప్పిస్తావా?" అంటూ సవాల్ విసిరారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News