: నోట్లు రద్దవుతాయని ముందే చంద్రబాబుకు తెలుసు... జాగ్రత్తపడ్డారు కూడా: జగన్


నోట్ల రద్దు గురించి చంద్రబాబుకు ముందే తెలుసునని వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి నుంచి విషయం తెలుసుకున్న ఆయన ముందే జాగ్రత్త పడ్డారని నిప్పులు చెరిగారు. ఆపై ఏమీ ఎరుగనట్టు, రూ. 2000 నోటు వద్దని మీడియా ముందు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆసుపత్రుల్లో పెద్ద నోట్లను తీసుకోవడం లేదని, దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పంట పొలాల నుంచి మార్కెట్లోకి కూరగాయలు చేరే పరిస్థితి లేకపోవడంతో రైతాంగం ఆందోళనలో ఉందని, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిచి పోయాయని ఆయన అన్నారు. సరకు రవాణా స్తంభించి పోయిందని గుర్తు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగ్గా చేయని కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని, వ్యవస్థను వెంటనే తిరిగి గాడిలో పెట్టేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని జగన్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News