: ఆసుపత్రి మంచంపై నుంచే తమిళులకు కృతజ్ఞతలు చెప్పిన జయలలిత
ఉపఎన్నికల్లో తమిళనాడులో అన్నా డీఎంకే అభ్యర్థులందరినీ గెలిపించిన తమిళవాసులకు ముఖ్యమంత్రి జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆసుపత్రి బెడ్ పైనే ఉన్న ఆమె, మూడు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ప్రజలు అందించిన విజయం, తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, స్కీములకు గుర్తింపని ఆమె అన్నారు. ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని, ప్రజలు తనకు అండగా ఉన్నారని మరోసారి నిరూపితమైందని ఆమె అన్నారు. ఈ మేరకు జయలలిత పేరిట ఓ ప్రకటన విడుదలైంది. ఈ ఎన్నికల్లో విజయం తనకు అత్యంత ఆనందాన్ని కలిగించిందని వ్యాఖ్యానించిన ఆమె, ప్రజల అంచనాల మేరకు భవిష్యత్తులో పని చేస్తానని హామీ ఇచ్చారు.