: 60శాతం భారతీయుల హెచ్1బి దరఖాస్తుల తిరస్కరణ
హెచ్1బి వీసాల కోసం ఈ నెల 1 నుంచి 5 వరకూ అమెరికా ఇమిగ్రేషన్ విభాగం దరఖాస్తులు స్వీకరించి లాటరీ విధానంలో కేటాయించింది. అయితే ఈ లాటరీ విధానంలో 60శాతం మంది భారతీయ అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని అంచనా. అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న 2014 సంవత్సరం కోసం మొత్తం 85వేల హెచ్1బి వీసాలు జారీ చేయగా 1,24,000 దరఖాస్తులు వచ్చాయి. 60 శాతం మంది భారతీయులు అదృష్టం లేకపోవడంతో వీసా సంపాదించలేకపోయారు.