: రైల్వే టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ పై సర్వీస్ ట్యాక్స్ రద్దు


పెద్ద నోట్ల రద్దు తరువాత తీవ్రమైన చిల్లర కొరత ఏర్పడిన వేళ, నగదు రహిత ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి డిసెంబర్ 31 వరకూ జరిపే అన్ని కొనుగోళ్లపైనా సర్వీస్ ట్యాక్స్ ను ఎత్తి వేస్తున్నట్టు ప్రకటించింది. ఆన్ లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే సేవా రుసుము చెల్లించనక్కర్లేదని వెల్లడించింది. బస్సు, రైలు టికెట్లకు చిన్న నోట్లు లేక ప్రయాణికులు అవస్థలకు గురవుతున్నందున, ఆన్ లైన్ బుకింగ్స్ ను ఆశ్రయిస్తే, సమస్య పరిష్కృతమవుతుందని ఐఆర్సీటీసీ పేర్కొంది.

  • Loading...

More Telugu News