: తల్లి ఉంగరం కొట్టేసి...స్కూల్లో పిల్లకు ప్రపోజ్ చేసిన బుడతడు!
బ్రిటన్ కి చెందిన ఓ బుడతడు చేసిన పనిని సుమారు 2 కోట్ల మంది సోషల్ మీడియాలో చూసి, ఆశ్చర్యపోయారు. వివరాల్లకి వెళ్తే... ఎలిమెంటరీ విద్య చదువుతున్న మిల్లీ ఒకరోజు స్కూలు నుంచి వచ్చి, తన తల్లిదండ్రులతో తన బ్యాగులో ఉంగరం ఉందని, తనకు టామీ ప్రపోజ్ చేసి ఇచ్చాడని చెప్పింది. ఆ వయసు పిల్లాడు ఏమిస్తాడు, బొమ్మ ఉంగరం ఇచ్చి ఉంటాడని మిల్లీ తల్లిదండ్రులు భావించారు. అయితే ఆమె బ్యాగు చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆ బ్యాగులో ఉన్నది బొమ్మ ఉంగరం కాదు... మూడు వజ్రాలు పొదిగిన ఎంగేజ్ మెంట్ రింగ్. దీనిని చూపుతూ మిల్లీ తండ్రి ఓ వీడియో తయారు చేసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అది వైరల్ అవుతోంది. కావాలంటే ఆ వీడియోను మీరు కూడా చూడండి.