: ఐ-ప్యాడ్ కన్నా తక్కువ బరువు ఉన్న ‘మిరాకిల్ బేబీ’!


ఐ-ప్యాడ్ కన్నా తక్కువ బరువు ఉన్న ఒక ‘మిరాకిల్ బేబీ’ యూఏఈ ఆసుపత్రిలో జన్మించింది. యూఏఈలోని మెడియర్ 24x7 ఆసుపత్రిలో జన్మించిన ఈ ఆడ శిశువు బరువు 631 గ్రాములు. మెడియర్ ఆసుపత్రిలోని నియోనాటోలజీ విభాగం అధిపతి గోవింద షెనాయ్ మాట్లాడుతూ, శిశువు తల్లి పిండం ఎదుగుదలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొందని చెప్పారు. తల్లి గర్భంలో 26.5 వారాల పాటు ఈ ఆడశిశువు ఉందని, హై-రిస్క్ ప్రెగ్నెన్సీ కారణంగా డెలీవరీ చేయడానికి చాలా కష్టపడ్డామన్నారు. లోయర్ (యుటరిన్) సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ (ఎల్ ఎస్ సీఎస్) పద్ధతిని అనుసరించి ఈ డెలివరీ చేశామని, అనంతరం, తల్లీబిడ్డలను పూర్తి స్థాయి పర్యవేక్షణలో ఉంచామన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యం బాగుందని, ఈ శిశువు బరువు ఇప్పుడు 2,050 గ్రాములకు పెరిగిందని షెనాయ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News