: ‘దీటైన జ‌వాబు ఇస్తాం’.. ముగ్గురు జవాన్ల ప్రాణాలు తీసిన పాకిస్థాన్ కు మనోహర్ పారికర్ హెచ్చరిక


జమ్మూకాశ్మీర్ లోని మచల్ సెక్టార్ లో ఈ రోజు కాల్పులకు తెగబడిన‌ పాకిస్థాన్ ఉగ్ర‌వాదులు ముగ్గురు భార‌త జ‌వాన్ల ప్రాణాలు తీసిన విష‌యం తెలిసిందే. ఈ దారుణ ఘ‌ట‌న‌పై ర‌క్ష‌ణ శాఖ‌ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్‌కి ఆర్మీ అధికారులు వివ‌రించారు. అనంత‌రం ఈ దాడిపై స్పందించిన మ‌నోహ‌ర్ పారిక‌ర్‌ ఈ చ‌ర్య‌ను పిరికిపంద‌ల చ‌ర్య అని అన్నారు. పాకిస్థాన్‌కు దీటైన జ‌వాబు ఇస్తామ‌ని హెచ్చరించారు. మ‌రోవైపు స‌రిహ‌ద్దు ప్రాంతంలో పాక్ ఉగ్ర‌వాదులు, భార‌త జ‌వాన్ల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు కొన‌సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News