: ఏటీఎంల ముందే కాదు బ్యాంకుల ముందూ 'నో క్యాష్' బోర్డులు
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరత కారణంగా ఇప్పటికే ఎన్నో ఏటీఎం కేంద్రాల ముందు నో క్యాష్ బోర్డులు కనిపిస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ఏటీఎంలలో పెట్టిన కొద్ది సేపటికే డబ్బు అయిపోతుండడంతో అందరికీ తగినంత నగదు అందడం లేదు. కొన్ని ఏటీఎం కేంద్రాల నుంచి రూ.2000 నోట్లు మాత్రమే వస్తున్నాయి. హైదరాబాద్ లో పలు బ్యాంకుల సిబ్బంది కూడా తమ వద్దకు వచ్చిన ఖాతాదారులకు నో క్యాష్ అని చెప్పేస్తున్నారు. శ్రీనగర్ కాలనీలోని ఆంధ్రాబ్యాంకు ముందు నో క్యాష్ బోర్డు కనపడడంతో ఖాతాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు వారాలుగా డబ్బు దొరక్కపోవడతో నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.