: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నూతన మార్గదర్శకాలు?.. కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం మీడియా సమావేశం


పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి రెండు వారాలయిన సంగతి తెలిసిందే. తమ నిర్ణయంతో సామాన్యులు ఎదుర్కుంటున్న క‌ష్టాల‌ను తీర్చ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌లు వెసులుబాట్ల‌ను చేస్తూ ప్ర‌క‌ట‌నలు చేసింది. తాజాగా ఈ రోజు సాయంత్రం మ‌రికొన్ని నూతన మార్గదర్శకాలను ప్రకటించనున్న‌ట్లు స‌మాచారం. న్యూఢిల్లీలో ఏర్పాటు చేయ‌నున్న ఈ మీడియా స‌మావేశంలో కేంద్ర ప్ర‌భుత్వం ముఖ్యంగా పెళ్లి వేడుక‌ల కోసం బ్యాంకుల నుంచి నగదు తీసుకోవ‌డానికి ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌కటిస్తుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ అంశంపై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన కేంద్ర ప్ర‌భుత్వం.. పెళ్లి ప‌త్రిక‌తో పాటు ప‌లు వివ‌రాలు చూపి పెళ్లి చేసుకోబోయే వ్య‌క్తి లేదా వారి త‌ల్లిదండ్రులు బ్యాంకు నుంచి 2.50 ల‌క్ష‌ల రూపాయ‌లు తీసుకోవ‌చ్చ‌ని తెలిపింది. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెల‌ప‌నున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News