: పాకిస్థాన్ దుశ్చర్య... భారత్ సైనికుడి శరీరం ఛిద్రం.. ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించిన ఆర్మీ
పాకిస్థాన్ మరోసారి తన దుర్బుద్ధిని ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల వెంబడి జమ్మూకాశ్మీర్ లోని మచల్ సెక్టార్ పై కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ సైనికులు అమరులు కాగా, ఒక సైనికుడి శరీరాన్ని ఛిద్రం చేశారు. ఇదే నెలలో పాక్ రెండు సార్లు ఇలాంటి దారుణానికి పాల్పడింది. దీనిపై స్పందించిన సైనికాధికారులు ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. గతంలో యూపీఏ హయాంలో కూడా పాక్ ఇలాంటి దారుణాలకు పాల్పడింది. ఒక సైనికుడి తల నరికి తీసుకెళ్లింది.