: ఆండర్సన్ పై సెటైర్ వేసి ఆనందపడిపోయిన సెహ్వాగ్


టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా ద్వారా సెటైర్ వేసి కసితీర్చుకున్నాడు. గతంలో 2011లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా సెహ్వాగ్ తొలి ఇన్నింగ్స్ లో తొలి బంతికే బ్రాడ్ బౌలింగ్ లో అవుట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో అండర్సన్ బౌలింగ్ లో మొదటి బంతికి పెవిలియన్ చేరాడు. దీంతో కింగ్ పెయిర్ గా 2011లోనే సెహ్వాగ్ కీర్తి గడించాడు. తాజాగా విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో జేమ్స్ ఆండర్సన్ కింగ్ పెయిర్ గా అవుటయ్యాడు. దీనిని పురస్కరించుకుని, 'గతంలో నేను కింగ్ పెయిర్ కావడానికి నువ్వు కారణమయ్యావు. ఇప్పుడు నువ్వు అలానే అయ్యావు. లెక్క సరిపోయినట్లుంది' అని సెహ్వాగ్ సెటైర్ వేశాడు.

  • Loading...

More Telugu News