: రీల్ వర్సెస్ రియల్... అమితాబ్ శరీరానికి మోదీ తల పెట్టిన వర్మ
పెద్ద నోట్లను రద్దు చేయాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్థిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆసక్తికరమైన ఫొటోను ట్విట్టర్లో అప్ లోడ్ చేశాడు వర్మ. అమితాబ్ తో తాను నిర్మిస్తున్న 'సర్కార్' సినిమాలోని ఫొటోలో... అమితాబ్ తలను తీసేసి అక్కడ మోదీ తలను అతికించాడు. దీనికి 'రీల్ వర్సెస్ రియల్' అంటూ ట్యాగ్ లైన్ యాడ్ చేశాడు. అయితే ఫొటో మాత్రమే పెట్టిన వర్మ.. ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం.
— Ram Gopal Varma (@RGVzoomin) November 22, 2016