: రహదారిపై వెళుతున్న 56 వాహనాలు ఢీ.. 17మంది మృతి


చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో బీజింగ్‌-కున్‌మింగ్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి గుండా వెళుతోన్న కార్లు, భారీ వాహనాలు దట్టమైన పొగమంచు కారణంగా ఒకదానికొకటి ఢీకొనడంతో 17మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 37 మంది గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఏకంగా 56 వాహ‌నాలు ఒకదానికొకటి ఢీకొని ప్ర‌మాదానికి గుర‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌లో పలు వాహనాల్లో మంటలు కూడా వ్యాపించ‌గా సహాయ సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చారు. ఆ రహదారి పునరుద్ధరణ ప‌నులు కొన‌సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News