: రాజ్యసభలో గందరగోళం.. వాయిదా
నిన్న జరిగిన కాన్పూర్ రైలు ప్రమాదం నేపథ్యంలో ఈ రోజు రాజ్యసభలో రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు సమాధానం చెప్పాలని విపక్ష నేతలు గందరగోళం సృష్టించారు. రైలు ప్రమాద ఘటనపై అంతకు ముందు రాజ్యసభలో సభ్యులకు ఓ పత్రాన్ని పంచారు. అయితే ఆ పత్రాలను ప్రభుత్వ వివరణగా భావించలేమని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంపై కేంద్ర సహాయమంత్రులు ఇప్పటికే రాజ్యసభలో వివరణ ఇచ్చారని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ అన్నారు. అయితే, ఈ అంశంపై విపక్ష నేతలు పోడియం వద్దకు దూసుకువెళ్లడంతో సభను ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.