: బంగారం వ్యాపారి ఇంట్లో లక్షల విలువైన బిస్కెట్లు స్వాధీనం


పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం ఉన్నవారు వాటిని వైట్ చేసుకోవడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో, దొరికినకాడికి బంగారాన్ని కొంటూ, తమ వద్ద ఉన్న పాత నోట్లను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి, బంగారం వ్యాపారుల నుంచి పూర్తి సహకారం అందుతోంది. ఈ నేపథ్యంలో, గోల్డ్ వ్యాపారులపై కస్టమ్స్ అధికారులు నిఘా పెంచారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఓ బంగారం వ్యాపారి ఇంటిపై కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 6 బంగారు బిస్కెట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 18 లక్షలు ఉంటుందని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News