: పెద్దనోట్ల రద్దుపై చర్చ జరగాల్సిందే!: గులాం నబీ ఆజాద్
రాజ్యసభలో కాన్పూర్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ... రైలు ప్రమాదంలో తీవ్ర నష్టం జరిగిందని, ఈ ప్రమాదంలో 133 మంది చనిపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దుపై చర్చ జరగాల్సిందేనని కోరారు. పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో చర్చకు ఇప్పటికే నోటీసులు ఇచ్చానని వ్యాఖ్యానించారు. అనంతరం స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నప్పటికీ విపక్షాలు నిరసన తెలపడం సరికాదని అన్నారు. సభను నడవకుండా చూడాలన్నదే విపక్షాల ఉద్దేశమని అన్నారు. విపక్ష సభ్యులు రాజ్యసభలో గందరగోళం సృష్టించడంతో రాజ్యసభను 15 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ తెలిపారు.