: 400 ఏళ్లనాటి ప్రాచీన విగ్రహం లభ్యం


400 ఏళ్లనాటి పురాతన వీరభద్ర విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. తమిళనాడులోని కడలూర్ జిల్లా బన్రూట్టి సమీపంలో ఈ విగ్రహం బయటపడింది. సీఎన్ పాళయం గ్రామంలో ఉన్న పుష్పగిరి మళయాండవర్ ఆలయ ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు చేపట్టారు. ఈ క్రమంలో, అక్కడ తవ్వకాలు కూడా జరిపారు. ఈ సందర్భంగా, 67 సెం.మీ ఎత్తు, 50 సెం.మీ వెడల్పు ఉన్న నల్లరాతి విగ్రహం లభించింది. దీనిపై పురావస్తు అధికారులు మాట్లాడుతూ, విగ్రహానికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం చేస్తామని చెప్పారు. పరిశోధనల నిమిత్తం ఆ విగ్రహాన్ని తమ కార్యాలయానికి తరలించారు.

  • Loading...

More Telugu News