: రద్దయిన నోట్ల విరాళాలను స్వీకరించం: ‘షిర్డీ సాయిబాబా సంస్థాన్’
రద్దయిన పెద్దనోట్లను ఇకపై విరాళాలుగా స్వీకరించమని షిర్డీలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. రూ.500, రూ.1000 నోట్లను విరాళాలుగా స్వీకరించడం నిలిపివేశామని, విరాళాల కింద ఇప్పటివరకు వచ్చిన పెద్దనోట్లను, బ్యాంకులో జమ చేశామని పేర్కొంది. నగదు రహిత లావాదేవీలు, విరాళాల స్వీకరణ కొనసాగుతుందని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆ ప్రకటనలో పేర్కొంది.