: ఇకపై ‘ఫేస్ బుక్’లో తప్పుడు వార్తలు ఉండవు: జుకర్ బర్గ్


ఇకపై ‘ఫేస్ బుక్’లో తప్పుడు వార్తలు, సమాచారం ఉండబోదని సీఈవో జుకర్ బర్గ్ ప్రకటించారు. ‘ఫేస్ బుక్’లో అప్ లోడ్ అవుతున్న తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. కాగా, ట్రంప్ అధ్యక్షుడు అయ్యేందుకు ‘ఫేస్ బుక్’ లో వచ్చిన తప్పుడు సమాచారం దోహదపడిందని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే జుకర్ బర్గ్ ఈ ప్రకటన చేశారు. తప్పుడు వార్తలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయమై చర్యలు తీసుకునేందుకు చాలాకాలంగా పనిచేస్తున్నామని జుకర్ బర్గ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News