: ‘హెరిటేజ్’ షేర్ విలువ పెరిగిన స్థాయిలో రాష్ట్రాభివృద్ధి ఎందుకు జరగలేదు?: వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్
‘హెరిటేజ్’ షేర్ విలువ పెరిగిన స్థాయిలో రాష్ట్రాభివృద్ధి ఎందుకు జరగలేదు? అని వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దు వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముందే తెలుసని, అందుకే, తన వ్యవహారాలన్నింటిని ముందే చక్కబెట్టుకున్నారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుకు తానే సూచన చేస్తూ లేఖ రాసినట్లుగా ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టారని మండిపడ్డారు. నోట్ల రద్దుకు పదిరోజుల ముందే చంద్రబాబు హెరిటేజ్ షేర్లను అమ్ముకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు హెరిటేజ్ సంస్థ షేర్ విలువ రూ.199 ఉంటే, ఆయన అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఆ షేర ధర రూ.999కి పెరిగిందన్నారు.