: సినీ నటుడు సాయికుమార్ పై కోపంగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి?
ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ పై మైనింగ్ కింగ్ గాలిజనార్దన్ రెడ్డి కోపంగా ఉన్నట్టు సమాచారం. ఆయన మీద ఈయనకు ఎందుకు కోపం అనుకుంటున్నారా? అయితే చదవండి. జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి వందల కోట్లు ఖర్చు చేశారని అనుకుంటున్నారు. తాను కోరుకున్న విధంగా తన కుమార్తె పెళ్లి చేశానన్న సంతోషం ఉన్నప్పటికీ, ఓ విషయంలో మాత్రం ఆయన చాలా అసహనంగా ఉన్నారట. దీనికంతా కారణం... వివాహానికి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు పెద్దగా రాకపోవడమే. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులను పెద్ద సంఖ్యలో పెళ్లికి ఆహ్వానించారు గాలి. అంతే కాదు, వారందరినీ పెళ్లికి తీసుకురావాల్సిన బాధ్యతను సాయికుమార్ పై ఉంచారాయన. కానీ, టాలీవుడ్ నుంచి పెద్దగా ఎవరూ వెళ్లలేదు. పెళ్లికి ముందు జరిగిన సంగీత్ కార్యక్రమానికి రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, సుమన్, బ్రహ్మానందం వంటి వారు కొంత మంది హాజరయ్యారు. పెద్ద స్టార్లు ఒక్కరు కూడా పెళ్లికి రాలేదు. దీంతో సాయికుమార్ పై గాలి బ్రదర్స్ తీవ్ర అసహనంతో ఉన్నారట. అయితే, హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు పెద్ద స్టార్లను తీసుకొస్తానని మాట ఇచ్చాడట సాయికుమార్.