: చంద్రబాబు అసెంబ్లీని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ గా మార్చేశారు: వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు
అసెంబ్లీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ గా మార్చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ప్రత్యేక హోదా కావాలని అడిగిన వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం అత్యంత దారుణమని ఆమె అన్నారు. దళితులను అగౌరవ పరిచేలా గతంలో మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వారితో సన్మానాలు చేయించుకుంటున్నారని ప్రశ్నించారు. గుంటూరులో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలంతా ముందుగానే బ్లాక్ మనీని వైట్ చేసుకుని, హాయిగా తిరుగుతున్నారని ఆరోపించారు.