: ఇంగ్లండ్ విజయలక్ష్యం 405 పరుగులు... 204 రన్స్ కు ఇండియా ఆలౌట్
విశాఖపట్నంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. రెండో ఇన్నింగ్స్ లో 204 పరుగులకు ఆలౌట్ అయిన ఇండియా... మొత్తంమీద 404 పరుగుల లీడ్ సాధించింది. దీంతో, ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెలవాలంటే 405 పరుగులు సాధించాలి. భారత సెకండ్ ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ 3, రాహుల్ 10, పుజారా 1, కోహ్లీ 81, రహానే 26, అశ్విన్ 7, సాహా 2, జడేజా 14, జయంత్ యాదవ్ 27, ఉమేష్ యాదవ్ 0, షమీ 19 పరుగుల చేశారు. చివర్లో రెండు సిక్సర్లతో షమీ అలరించాడు. జయంత్ యాదవ్ నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, రషీద్ లు చెరో 4 వికెట్లు తీసుకోగా... అలీ, అండర్సన్ లు చెరో వికెట్ తీసుకున్నారు. భోజన విరామం తర్వాత ఇంగ్లండ్ తన లక్ష్య సాధనను మొదలుపెడుతుంది. స్పిన్ కు పిచ్ సహకరిస్తుండటంతో భారత బౌలర్లు సత్తా చాటే అవకాశం కనిపిస్తోంది.