: బాధతో మాటలు కూడా రావడం లేదు: పాట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటనపై మోదీ


ఉత్తరప్రదేశ్ లో ఈ తెల్లవారుజామున పాట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో ఆవేదన కలిగిస్తోందని... బాధతో మాటలు కూడా రావడం లేదని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడి, ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ ఘటనలో 45 మంది చనిపోగా, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News