: తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు చిల్లర ఎఫెక్ట్.. పెరిగిన మటన్ ధర.. తగ్గిన సరఫరా
ఆదివారం నాడు ముక్క లేకుండా ముద్ద దిగని వారికి చిల్లర కష్టాలు మొదలయ్యాయి. చిల్లర బెడద కారణంగా మటన్, చేపల మార్కెట్లు వెలవెలబోతున్నాయి. కొనుగోళ్లు తగ్గడంతో సరఫరా తగ్గింది. ఫలితంగా చేపలు, మటన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్‌లోని చేపల మార్కెట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిల్లర లేకపోవడంతో మాంసం, చేపల వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క, పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరులో చేపల విక్రయాలు గణనీయంగా పడిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. టోకున చేపలు కొనుగోలు చేసి గ్రామాల్లో విక్రయించే చిల్లర వ్యాపారులు కూడా అమ్మకాలను నిలిపివేశారు. ఎక్కడికెళ్లినా రూ.2000 నోట్లు ఇస్తుండడంతో చిల్లర కష్టాలు భరించలేక తాత్కాలికంగా వ్యాపారానికి పుల్‌స్టాప్ పెట్టినట్టు చెబుతున్నారు.