: 'స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే అలా నటించడానికైనా సిద్ధమే' అంటున్న బాలీవుడ్ నటుడు


స్క్రిప్ట్ డిమాండ్‌ చేస్తే కనుక నగ్నంగా నటించడానికి కూడా వెనుకాడనని బాలీవుడ్ నటుడు గుర్మీత్ చౌదరి ప్రకటించాడు. డిసెంబర్ 2న విడుదల కానున్న 'వజా తుమ్ హో' సినిమా ప్రమోషన్ లో గుర్మీత్ చౌదరి మాట్లాడుతూ, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ పిలిచి, 'నీకు తగిన పాత్ర ఉంది, మరి ఓ సీన్ లో నగ్నంగా పరిగెత్తాలి' అని చెబితే అలా చేయడానికి తాను సిద్ధమని అన్నాడు. చేసే ప్రతి పాత్రలోను వందశాతం ప్రతిభను ప్రదర్శించే ప్రయత్నం చేస్తానని అన్నాడు. 'వజా తుమ్ హో'లో హాట్‌ సన్నివేశాలున్నాయని చెప్పాడు. అయితే అవి అసభ్యకరంగా ఉండవని, ఆకట్టుకునేలా ఉంటాయని తెలిపాడు.

  • Loading...

More Telugu News