: గంటా ఆదేశం...ఉషారాణి ఆత్మహత్య కేసులో సీనియర్లపై కేసులు


ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో పోలీసులు కదిలారు. ఆత్మహత్యకు పాల్పడ్డ కర్నూలు జిల్లా నంద్యాల ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని ఉషారాణి కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. సీనియర్ల ర్యాంగింగ్ దాహానికి ఉషారాణి బలైందని ఆరోపించడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెపై ర్యాగింగ్ కు పాల్పడ్డ ఆరుగురు సీనియర్లపై కేసులు నమోదు చేశారు. గతంలో నాగార్జున వర్శిటీలో రిషితేశ్వరి అనే విద్యార్థిని ఇలాంటి నేపథ్యంలోనే ఆత్మహత్యకు గురైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News