: సుష్మకు కిడ్నీ ఇచ్చి రుణం తీర్చుకుంటా: ముంబై ఇంజనీర్ ప్రకటన
కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు కిడ్నీ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా పలువురు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు పునర్జన్మ ప్రసాదించిన సుష్మాకు కిడ్నీ ఇచ్చి, రుణం తీర్చుకుంటానని ముంబైకి చెందిన ఇంజనీర్ ఫహీమ్ అన్సారీ చెబుతున్నారు. మాల్దీవుల్లో అక్రమ డ్రగ్ కేసులో ఇరుక్కున్నప్పుడు తన కుటుంబం ఎంపీ కిరీట్ సోమయ్య సహకారంతో సుష్మా స్వరాజ్ ను కలిసి తనకు సహాయం చేయాలని కోరారని, ఈ సందర్భంగా ఆమె విదేశాంగ మంత్రి హోదాలో మాల్దీవులు ప్రభుత్వంతో మాట్లాడి, తనను శిక్ష నుంచి కాపాడి, స్వదేశానికి వచ్చేలా సహాయం చేశారని అన్నారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన ఆమెకు తన కిడ్నీ ఇచ్చి రుణం తీర్చుకుంటానని ఆయన తెలిపారు.