: ప్రధాని మోదీతో సమావేశమైన కేసీఆర్.. ‘పెద్దనోట్ల రద్దు’పై అన్ని రాష్ట్రాల సీఎంలతో భేటీ కావాలని సూచన
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పెద్దనోట్ల రద్దు సహా పలు అంశాలపై ఆయన ప్రధానితో చర్చిస్తున్నారు. ముఖ్యంగా వారిద్దరి మధ్య పెద్దనోట్ల రద్దు తరువాత ఏర్పడిన పరిణామాలపైనే చర్చ కొనసాగుతోంది. ఈ నెల 8 తరువాత తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై పడిన ప్రభావం, రాష్ట్రంలోని సామాన్య ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు నష్టపోతున్న తీరుపై కేసీఆర్ వివరిస్తున్నారు. వీరు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కోరినట్లు సమాచారం. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం జరపాలని మోదీకి కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.