: భారత్ లో ఆఫీస్ తెరవనున్న షేర్ ఇట్


చైనా ఆధారిత కంటెంట్ షేరింగ్ యాప్ అయిన 'షేర్ ఇట్' సంస్థకు భారత్ లో విశేషమైన వినియోగదారులున్నారు. దీనిని మరింత విస్తృతం చేసుకునేందుకు 'షేర్ ఇట్' తన ఆఫీసును ఢిల్లీలో తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. బెంగళూరులో షేర్ ఇట్ నిర్వహించిన తొలి క్యాంపస్ మీట్ లో ఈ విషయం వెల్లడించింది. గ్లోబల్ విస్తరణ ప్రణాళికలో భాగంగా గుర్గావ్ లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు షేర్ ఇట్ తెలిపింది. ఈ కేంద్రం ద్వారా త్వరలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తామని తెలిపింది. ముఖ్యంగా ఉపఖండం నుంచి వస్తున్న డిమాండ్ కారణంగా వ్యాపార విస్తరణలో భారత మార్కెట్ ముఖ్యమైనదిగా భావించామని, అందుకే ఇక్కడ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని షేర్ ఇట్ మార్కెటింగ్ డైరెక్టర్ జియో లీ డ్యూ తెలిపారు. దీంతో తమ వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు, దగ్గరగా పనిచేసే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. షేర్ ఇట్ ద్వారా ప్రతి రోజూ 150 మిలియన్ల ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఫైళ్లు షేర్ అవుతున్నట్టు సంస్థ ప్రకటించింది.

  • Loading...

More Telugu News