: రిలయన్స్ జియో మరో సంచలనం.. వివిధ ప్లాన్లలో 'ఫైబర్ బ్రాడ్ బాండ్' సేవలు


రిలయన్స్ నుంచి సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఇటీవల 4 జీ సేవలతో జియోను భారత్ కు పరిచయం చేసి టెలికాం రంగంలో సంచలనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. దీంతో టెలికాం సంస్థలన్నీ తీవ్ర కుదుపుకు గురయ్యాయి కూడా. ఈ సారి జియో నుంచి మరో సంచలన ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. జియో గిగా ఫైబర్ బ్రాడ్ బాండ్ సేవల ప్లాన్ కింద 500 రూపాయలకు 600 జీబీ డేటాను అందజేయనున్నట్లు సమాచారం. ఈ సేవలను ముందుగా ముంబై, పూణే, చెన్నయ్ నగరాలలో అందుబాటులోకి తెస్తున్నట్టు జియో వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వంద నగరాలకు ఈ సేవలను మెల్లగా విస్తరిస్తారు. దీంతో బ్రాండ్ బ్యాండ్ సేవల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నట్టు కనిపిస్తోంది. రిలయన్స్ బ్రాండ్ బ్యాండ్ మార్కెట్ లోకి పూర్తిగా అందుబాటులోకి వస్తే... సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News