: రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...క్రీజులో కోహ్లీ, పుజారా
విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 255 పరుగుల వద్ద ముగియగా, టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి, ఇంగ్లండ్ కు భారీ లక్ష్యం నిర్దేశించాలనే లక్ష్యంతో వచ్చిన మురళీ విజయ్ (3), కేఎల్ రాహుల్ (10) లు వెంటవెంటనే పెవిలియన్ కు చేరారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు ఛటేశ్వర్ పుజారా (1), విరాట్ కోహ్లీ (11) బ్యాటింగ్ కు దిగారు. దీంతో టీమిండియా 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ఈ రెండు వికెట్లను ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తీయడం విశేషం.