: గంటా శ్రీనివాసరావును వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలి: ఎమ్మెల్యే రోజా
కర్నూలు జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్యపై స్పందించాల్సిన రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశాల్లో హాయిగా పర్యటిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న గంటాను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... రాష్ట్రం అన్ని విషయాల్లోనూ నెంబర్ వన్‌గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారని అయితే, అఘాయిత్యాలు, అరాచకాలు, ఆత్మహత్యలలో మాత్రం రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఆమె విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర సర్కారు నియమించిన కమిటీ ఏమైందని ఆమె అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆడపిల్లలు లేరని, అందుకే వారి విలువ, బాధలు ఆయనకు తెలియడం లేదని ఆమె అన్నారు.