: విజృంభించిన‌ అశ్విన్‌... 255 ప‌రుగుల‌కే ఆలౌటైన ఇంగ్లండ్‌.. అవకాశమున్నా ఫాలో ఆన్ ఇవ్వని కోహ్లీ


ఇంగ్లండ్, భార‌త్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు మొద‌టి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌల‌ర్ అశ్విన్ విజృంభించి బౌలింగ్ చేయ‌డంతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు 255 ప‌రుగుల‌కే ఆలౌటైంది. భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్ లో త‌మ ముందు ఉంచిన 455 ప‌రుగులను అధిగ‌మించే ప్ర‌య‌త్నంలో తొలి ఇన్నింగ్స్‌ 103/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట‌ ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఈ రోజు కూడా పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో మొద‌టి ఇన్నింగ్స్ లో భారత్‌కు 200 పరుగుల ఆధిక్యం లభించింది. మొదటి ఇన్నింగ్స్ లో అశ్విన్ కి ఐదు వికెట్లు దక్కాయి. షమీ, ఉమేష్‌, జ‌డేజా, యాద‌వ్ లకు ఒక్కో వికెట్ ద‌క్కాయి. మొద‌టి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో కుక్ 3, హ‌మీద్ 13, రూట్ 53, డ‌కెట్ 5, అలీ 1, స్టోక్స్ 70, బ‌యిర్ స్టో 53, ర‌షీద్ 32, అన్సారీ 4, బ్రాడ్ 13, అండ‌ర్స‌న్ 0 ప‌రుగులు చేశారు. అయితే, ఇంగ్లండ్ కు ఫాలో ఆన్ ఇచ్చే అవకాశమున్నా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుకు నిరాకరించాడు. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్లుగా క్రీజులోకి విజ‌య్‌, రాహుల్ లు వచ్చారు.

  • Loading...

More Telugu News