: రెండు సార్లు ప్రభాస్ ను కలిశానంటూ మనసులో మాట చెప్పిన షటిల్ బ్యూటీ గుత్తా జ్వాల


షటిల్ క్రీడాకారిణిగా, అంతకుమించి తన వివాదాస్పద ప్రవర్తనతో నిత్యమూ వార్తల్లో నిలిచే గుత్తా జ్వాల మరోసారి మీడియా ముందుకు వచ్చింది. తనకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని చెబుతూ, ఆయన హైట్ అంటే ఇంకా ఇష్టమని, 'ఐ లవ్ హిమ్' అని అంటోంది. "హిందీతో పాటు తెలుగు సినిమాలను బాగా చూస్తాను. ప్రభాస్ ను రెండు సార్లు కలిశాను కూడా. చాలా మంచి వ్యక్తి. ఇక నాని నటన అన్నా కూడా ఇష్టమే. అతను నాకు మంచి ఫ్రెండ్. నితిన్ తో స్నేహం గురించైతే చెప్పే అవసరం లేదు. సినిమాల్లో నటిస్తాను అని ఒక్క మాట చెప్పగానే ఓ ఆఫర్ తీసుకుని వచ్చేశాడు" అని చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News