: ఆదర్శంగా నిలుస్తున్న బంజారాహిల్స్ ఎస్‌బీఐ.. సిబ్బంది సమన్వయం.. తగ్గిన ఖాతాదారుల కష్టాలు
అన్నీఇన్నీ కావు. ఉన్న డబ్బులు చెల్లక, ఏటీఎంల నుంచి డబ్బులు రాక, మార్చుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోలేక వారు పడుతున్న కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. నోట్ల మార్పిడి, పాత నోట్ల డిపాజిట్‌ల కోసం ప్రజలు బ్యాంకులకు క్యూకడుతున్నారు. దీంతో బ్యాంకుల వద్ద పెద్దపెద్ద క్యూలు ఏర్పడుతున్నాయి. ఈ ఇబ్బందులకు పుల్‌స్టాప్ పెట్టాలని భావించిన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని ఎస్‌బీఐ శాఖ అధికారులు, సిబ్బంది చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఖాతాదారులకు సకాలంలో మెరుగైన సేవలు అందుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు తీసుకున్న చర్యల కారణంగా గంటల తరబడి క్యూలో నిల్చునే బాధ తప్పింది. ఇక్కడ ప్రత్యేక అవసరాలు కలిగిన వారు, వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. మహిళల కోసమే మరో కౌంటర్ అందుబాటులో ఉంచారు. మిగతావారి కోసం మరో కౌంటర్ ఏర్పాటు చేశారు. మూడు కౌంటర్లలోని క్యూల్లో నిల్చున్న వారికి ఎప్పటికప్పుడు మంచినీళ్లు, టీ సరఫరా చేస్తున్నారు. కూర్చునేందుకు కుర్చీలు కూడా ఉంచారు. బ్యాంకు సిబ్బంది ఏమాత్రం విసుక్కోకుండా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నారు. బ్యాంకు సేవలపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బ్యాంకు ఇలానే చేస్తే అసలు సమస్యే ఉండదని చెబుతున్నారు.