: రేపు సీనియర్ సిటిజన్లకు మాత్రమే బ్యాంకులలో లావాదేవీలు!
పెద్దనోట్ల మార్పిడి నిమిత్తం సీనియర్ సిటిజన్లు మినహా మరెవరూ రేపు బ్యాంకులకు వెళ్లడానికి వీలులేదు. రేపు ఒక్కరోజు దేశ వ్యాప్తంగా సీనియర్ సిటిజన్లు తమ పెద్దనోట్లను మార్చుకునేందుకు, ఇతర లావాదేవీలను నిర్వహించుకునేలా బ్యాంకులు అవకాశం కల్పించాయి. బ్యాంకు సాధారణ వేళల్లో నగదు మార్పిడి, లావాదేవీలకు సీనియర్ సిటిజన్లను మాత్రమే రేపు అనుమతిస్తామని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. కాగా, నోట్ల మార్పిడి నిమిత్తం బ్యాంకుల ముందు బారులు తీరుతున్న వారిలో యువకులు, మహిళలు, మధ్యవయస్కులు, సీనియర్ సిటిజన్లు ఉంటున్నారు. గంటలకొద్దీ నిలబడటంతో ఓపిక నశిస్తోందని వృద్ధులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఒక్కరోజును సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా బ్యాంకులు కేటాయించాయి.