: పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం
నల్ల కుబేరులు తాము కట్టలు కట్టలుగా దాచుకున్న డబ్బుని పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఇతరుల ఖాతాల్లోకి వేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని లావాదేవీలపైన నిఘా ఉంచామని, పన్ను ఎగవేతదారులు ఇటువంటి చర్యలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు, సామాన్యులు ఇతరుల డబ్బుని తమ ఖాతాలో వేసుకొని ఖాతాల దుర్వినియోగానికి పాల్పడితే ఇన్‌కం ట్యాక్స్ చట్టం కింద వారు కూడా విచారణ ఎదుర్కోకతప్పదని పేర్కొంది. నల్లధన నిర్మూలనకు దేశ ప్రజలందరూ సహకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.