: ఏ క్షణంలో అయినా పెద్ద నోట్ల మార్పిడీ బంద్?
ఏ క్షణంలో అయినా పెద్దనోట్ల మార్పిడీ బంద్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఆర్బీఐ, ఆర్థిక శాఖలు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 24 లేదా అంతకంటే ముందే పెద్ద నోట్ల మార్పిడీ బందయ్యే అవకాశం కనిపిస్తోంది. నల్లకుబేరులు ఒప్పందాలు చేసుకుని నల్లధనం మార్చుకుంటున్నారన్న ఊహగానాల నడుమ, నగదు రహిత లావాదేవీలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం పాత నోట్లను బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వారు మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆ తర్వాత చెక్ లేదా డెబిట్ కార్డు ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చని తెలుస్తోంది.