: అనంతపురం పోలీసుల వైఖరిపై హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితుడు


అనంతపురంలోని స్టేట్ బ్యాంక్ సాయినగర్ బ్రాంచ్ దగ్గర మాధవరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన సంఘటన ఇటీవల జరిగింది. డబ్బులు తీసుకునే నిమిత్తం అక్కడికి వచ్చిన సందర్భంలో మాధవరెడ్డిని పోలీసులు చితకబాదారు. దీంతో, తీవ్రంగా గాయపడ్డ మాధవరెడ్డి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అనంతపురం పోలీసుల వైఖరిని నిరసిస్తూ హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. త్రీటౌన్ సీఐ గోరంట్ల మాధవ్, ఎస్సైలు క్రాంతికుమార్, జనార్దన్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన హెచ్ ఆర్సీ అధికారులు.. ఈ నెల 24వ తేదీ లోగా తమకు నివేదిక సమర్పించాలని ఏపీ డీజీపీ, అనంతపురం ఎస్పీని ఆదేశించారు.

  • Loading...

More Telugu News