: ఆ గ్రామవాసులంతా పాము పుట్టల్లాంటి ఇళ్లలో జీవిస్తున్నారు.. ఆసక్తి కనబరుస్తున్న పర్యాటకులు


ఎత్తైన పాముల పుట్టలను మ‌నం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. వాటిల్లో పాములు మాత్ర‌మే జీవిస్తుంటాయి. అయితే, అదే ఆకృతిలో ఉన్న ఇళ్ల‌లో మ‌నుషులు జీవిస్తున్నారు. ఇరాన్‌లోని ఓ గ్రామంలో గుహ‌ల‌ను పోలిన ఇటువంటి ఇళ్ల‌లోనే అక్క‌డి వాసులు జీవిస్తున్నారు. ఇలా ఇళ్ల‌ను క‌ట్టుకోవాల‌ని వ‌చ్చిన ఐడియా ఇప్ప‌టిది కాదు, 700 ఏళ్లుగా అక్క‌డి ప్ర‌జ‌లు ఈ గుహల్లోనే జీవిస్తున్నారు. ఇరాన్‌కి పశ్చిమంగా అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ నుంచి 60 కి.మీ వెళితే, ‘కండోవాన్‌’ అనే గ్రామంలో ఇటువంటి ఇళ్లను మ‌నం చూడ‌వ‌చ్చు. పెద్ద‌పెద్ద పాముల‌న్నీ ఒక్క‌చోట‌చేరి ఇక్క‌డి పుట్ట‌ల్లో జీవిస్తున్నాయా? అన్న‌ట్లు ఆ గ్రామంలో గుంపులు గుంపులుగా క‌ర‌న్ అనే గూళ్లు ఉంటాయి. కొండ ప్రాంత గుహల్లో ఈ ఇళ్ల‌ను నిర్మించుకున్నారు. అక్క‌డి ప్రాంతాల్లో ఈ గుహలు అగ్నిపర్వతం పేలడం వ‌ల్ల ఏర్ప‌డ్డాయని చెబుతుంటే, అక్క‌డి వాసులు మాత్రం వాటిని 700 సంవత్సరాల క్రితమే తమ పూర్వీకులు నిర్మించార‌ని చెబుతున్నారు. గ‌తంలో మంగోల్‌ ఆర్మీ జవాన్లు యుద్ధ సమయంలో వీటిల్లోనే ఉండేవార‌ట‌. ఆ త‌రువాత అక్క‌డి ప్రజలు వాటిని ఇళ్లుగా ఉప‌యోగిస్తున్నారు. గుహ అంటే మామూలుగా ఉండే గుహ‌కాదు. వీటిల్లో ఒక్కోగుహ‌లో మూడు గదులు, ఒక స్టోర్‌ రూమ్‌ వుంటాయి. అంతేగాక‌, పెంపుడు జంతువులను ఉంచ‌డానికి షెల్టర్ కూడా ఉంటుంది. అన్ని ఇళ్ల‌కీ తలుపులు, పై అంతస్తుకు వెళ్లడానికి మెట్లు లాంటి సౌక‌ర్యాలు ఉంటాయి. ఎండాకాలంలోనూ ఆ గ్రామంలో చాలా చల్లటి వాతావ‌ర‌ణం ఉంటుంది. చ‌లికాలంలో వెచ్చని వాతావ‌ర‌ణం ఉంటుంది. ప‌ర్యాట‌కులు వీటిపై ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

  • Loading...

More Telugu News